కరోనా రెండో దశ విజృంభణలో మందులు, ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమందికి సాయం చేయడం కోసం పలువురు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. సాయం కోరిన వారికి సోషల్‌మీడియా వేదికగా అవసరమైన సమాచారాన్ని అందజేస్తూ తరచూ అందుబాటులో ఉంటున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ నటి తాప్సీ ట్విట్టర్ వేదికగా ఆక్సిజన్ సిలిండర్లు, అవసరమైన మందులు ఎవరి వద్ద లభ్యమవుతాయో వాళ్ల సమాచారాన్ని నెట్టింట్లో పోస్ట్ చేస్తున్నారు.
'చెత్త మెసేజ్‌లతో నా టైమ్ వృథా చేయకండి' - ఆక్సిజన్ సిలిండర్ పై తాప్సీ ఫైర్
తనకు సెటైర్ వేసిన ఓ నెటిజన్‌పై మండిపడింది తాప్సీ. చెత్త మెస్సేజ్‌లతో తన సమయాన్ని వృథా చేయొద్దని చెప్పింది.
తాప్సీ
తాజాగా ఓ నెటిజన్.. "ఇంట్లో కూర్చొని ట్వీట్లు చేసే బదులు అత్యంత ఖరీదైన నీ కారుని వాళ్లకు అందిస్తే ఏదో ఒకరకంగా ఉపయోగించుకుంటారు కదా" అని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌పై తాప్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఒకవేళ మీలాంటి వాళ్లు నాకు ఇదే చెప్పాలనుకుంటే.. దేశం మళ్లీ సాధారణంగా ఊపిరి పీల్చుకునే స్థాయికి వెళ్లేవరకూ నోరు విప్పకండి. ఇలాంటి చెత్త మెసేజ్‌లతో నా టైమ్‌ను వృథా చేయకండి. నేను ఏం చేయాలనుకున్నానో అది చేయనివ్వండి" అని తాప్సీ మండిపడ్డారు.
Last Updated : Apr 27, 2021, 11:41 AM IST