బాలీవుడ్ బ్యూటీ తాప్సీకి ముంబయి అదానీ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ షాక్ ఇచ్చింది. ముంబయిలోని తన నివాసానికి సంబంధించిన విద్యుత్ వినియోగ బిల్లును అధికంగా విధించారని అసంతృప్తిని వ్యక్తం చేసింది తాప్సీ. లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా బిల్లు తీయకుండా వాటన్నిటిని తాజాగా పంపారు. అన్ని శ్లాబులనూ కలిపి ఒక్కనెలలోనే రూ.36 వేల విద్యుత్ సుంకాన్ని విధించారు. సాధారణ రోజుల కన్నా మూడు రెట్లు అదనంగా బిల్లు రావడం వల్ల ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది తాప్సీ.
"మూడు నెలల లాక్డౌన్లో ఎలాంటి కొత్త గృహోపకరణాలు నా అపార్ట్‌మెంట్‌కు తెచ్చుకోలేదు, వాడనూలేదు. కానీ, చివరి నెలలో మాత్రం ఎలక్ట్రిసిటీ బిల్లు అమాంతం పెరిగిపోయింది. ముంబయి అదానీ ఎలక్ట్రిసిటీ.. మా నుంచి మీరు ఎలాంటి విద్యుత్‌కు బిల్లు వసూల్ చేస్తున్నారు".