బాలీవుడ్‌లో జోరు చూపిస్తుంది తాప్సీ. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూ ముందుకెళుతోంది. ఇటీవల ఆమె ఓ పాన్ ఇండియా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అది ఓ సైన్స్ ఫిక్షన్ కథని, దానికి 'ఏలియన్' అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. భరత్ నీలకంఠన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట.
"గ్రహాంతర వాసుల నేపథ్యంగా సాగే సైన్స్ ఫిక్షన్ కథ ఇది. ఎక్కడా హాలీవుడ్ ఏలియన్ సినిమాల ఛాయలు ఇందులో కనిపించవు. కొత్తగా ఉంటుంది. భారతదేశంలో ఏలియన్స్ ఉంటే ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ చిత్రం ఉండనుంది"అని బాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.