తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'డేట్లు సర్దుబాటు చేసినా.. సినిమా నుంచి తప్పించారు!' - పతి పత్నీ ఔర్​ వో సినిమాలో తాప్సీ

చిత్రసీమలో జరిగే అన్యాయాలను నిస్సందేహంగా మీడియాకు తెలియజేయంలో ముందుంటారు బాలీవుడ్​ నటి తాప్సీ(Taapsee Pannu). అయితే తాను గతంలో నటించాల్సిన ఓ సినిమా నుంచి అనుకోకుండా తప్పించారని ఆరోపించారు. ఆ ప్రాజెక్టు కోసం డేట్స్​ సర్దుబాటు చేసుకున్నా.. తనకు చెప్పకుండా సినిమా నుంచి తీసివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అందుకు గల కారణాన్ని కూడా నిర్మాతలు చెప్పలేదని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Taapsee Pannu recently revealed that she was dropped from the film
'డేట్లు సర్దుబాటు చేసినా.. సినిమా నుంచి తప్పించారు!'

By

Published : Jun 29, 2021, 6:57 PM IST

Updated : Jun 29, 2021, 8:24 PM IST

గతంలో తాను అంగీకరించిన ఓ సినిమా నుంచి తనను తప్పించినట్లు బాలీవుడ్​ నటి తాప్సీ(Taapsee Pannu) ఆరోపించారు. కథ నచ్చి డేట్స్​ ఇచ్చినా.. తర్వాత సినిమా నుంచి చెప్పకుండా తీసేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనను తప్పించడానికి కారణమేంటో ఇప్పటివరకు తెలియదని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

"ఓ సినిమాలోని పాత్ర కోసం నిర్మాతలు నన్ను సంప్రదించారు. కథ నచ్చి డేట్స్​ కూడా ఇచ్చేశాను. అంతలోనే ఆ చిత్రం నుంచి నన్ను తప్పించారని మీడియా ద్వారా తెలిసింది. వారు నన్ను తర్వాత కలిసి, క్షమాపణలు చెప్పారు. అయితే వారి నుంచి నేను క్షమాపణ కోరలేదు. కానీ, నటించేందుకు నేను సిద్ధపడినా.. ఆ సినిమాలో నుంచి నన్ను ఎందుకు తప్పించారో కారణం చెప్పలేదు".

- తాప్సీ, బాలీవుడ్ కథానాయిక

అయితే అది ఏ సినిమా అనేదానిపై హీరోయిన్​ తాప్సీ స్పష్టత ఇవ్వలేదు. కానీ, బాలీవుడ్​లో రెండేళ్ల క్రితం విడుదలైన 'పతి పత్ని ఔర్​ వో'(taapsee pati patni aur woh) గురించి ఆమె పరోక్షంగా మాట్లాడారని తెలుస్తోంది. 2019లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో కార్తిక్​ ఆర్యన్​, భూమి పెడ్నేకర్​, అనన్యా పాండే ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ముదస్సార్​ అజీజ్​ దర్శకత్వం వహించగా.. భూషణ్​ కుమార్​, జూనో చోప్రా, కృష్ణన్​ కుమార్​ నిర్మాతలుగా వ్యవహరించారు.

నిర్మాతల స్పందన

అయితే తాప్సీ చేసిన ఆరోపణలపై స్పందించిన 'పతి పత్నీ ఔర్​ వో' నిర్మాతలు భూషణ్​ కుమార్​, జూనో చోప్రా.. ఆ సినిమా నుంచి తాప్సీని తప్పించడంపై స్పష్టత ఇచ్చారు. "చిత్రసీమలో ప్రతి దర్శకనిర్మాతలు చేసినట్లే.. మేము కూడా స్క్రిప్ట్​ వర్క్​ పూర్తయిన తర్వాత నటీనటుల కోసం సంప్రదింపులు జరిపాం. ఆ సినిమా కోసం అనేక స్టార్​ నటీనటులతో మంతనాలు జరిపాం. ఈ నేపథ్యంలో ఓ హీరోయిన్​ పాత్ర కోసం తాప్సీని సంప్రదించిన మాట నిజమే. అయితే చివరికి ఆ పాత్ర కోసం తాప్సీని ఖరారు చేయలేదు. అయినా కథ డిమాండ్​ను బట్టి నటీనటుల ఎంపిక అనేది ఉంటుంది. కానీ, తాప్సీ.. పరిశ్రమలో ప్రతిభావంతురాలు. భవిష్యత్​లో తాప్సీతో కలిసి పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం" అని నిర్మాతలు వెల్లడించారు.

తాప్సీ నటించిన 'హసీన్​ దిల్​రూబా' జులై 2న నెట్​ఫ్లిక్స్​(haseen dillruba on netflix) ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తాప్సీతో పాటు విక్రాంత్​ మాస్సే, హర్షవర్ధన్​ రాణేలు నటించారు. ఈ సినిమాకు వినీల్​ మ్యాథ్యూ దర్శకత్వం వహించారు.

ఇదీ చూడండి..తాప్సీతో రొమాంటిక్​ సీన్స్​.. భయపడిన ఆ హీరోలు

Last Updated : Jun 29, 2021, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details