తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శభాష్​ మిథు'.. ఆట షురూ! - తాప్సీ శభాష్ మిథు

బాలీవుడ్​లో వరుస చిత్రాలతో బిజీగా మారింది స్టార్​ హీరోయిన్​ తాప్సీ. సవాళ్లు విసిరే విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ప్రస్తుతం భారత మహిళా క్రికెట్​ క్రీడాకారిణి మిథాలీ రాజ్​ జీవితకథతో తెరకెక్కుతోన్న 'శభాష్​ మిథు' కోసం క్రికెటర్​గా అవతారమెత్తింది.

Taapsee Pannu kickstarts Shabaash Mithu shoot
'శభాష్​ మిథు'.. ఆట షురూ!

By

Published : Apr 6, 2021, 8:05 AM IST

Updated : Apr 6, 2021, 8:25 AM IST

స్టార్​ కథానాయిక తాప్సీ సినీ ప్రయాణంలో దూకుడు కనిపిస్తోంది. కొత్తదనం నిండిన కథలకు.. సవాల్ విసిరే పాత్రలకు చిరునామాగా నిలుస్తూ బాక్సాఫీస్ ముందు సత్తా చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడామె 'శభాష్ మిథు' సినిమా కోసం క్రికెటర్‌గా మారింది. భారత మహిళా క్రికెట్ సారథి మిథాలీ రాజ్ జీవితకథతో రూపొందుతోన్న చిత్రమిది. రాహుల్ ధోలాబియా దర్శకుడు. వయాకామ్ 18 సంస్థ నిర్మిస్తోంది.

ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ చిత్రం.. ఇటీవలే రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకొంటోంది. దీనికి సంబంధించి, తాప్సీ ఇన్​స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. 'లెట్స్ గో డే - 1' అంటూ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ ఫొటోను ఇన్​స్టాలో షేర్ చేసింది.

ఈ చిత్రం కోసం ఆమె కొన్ని నెలలుగా క్రికెట్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. ఇందుకోసం నూషిన్ అల్ ఖాదీర్ అనే కోచ్​ను ఆమె నియమించుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ప్రస్తుతం తాప్సీ నటించిన 'రష్మీ రాకెట్', 'లూప్ లపేటా' చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ఇదీ చూడండి:'డాక్టర్​ జి' కోసం కొత్త జంట.. సరికొత్త ప్రయాణం

Last Updated : Apr 6, 2021, 8:25 AM IST

ABOUT THE AUTHOR

...view details