కరోనాతో దాదాపు మూడునెలలపాటు నిలిచిపోయిన చిత్రీకరణలు, ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల్లో భాగంగా పునఃప్రారంభమయ్యాయి. అయినా కరోనా నేపథ్యంలో ప్రముఖ నటులెవరు ఇప్పటివరకు చిత్రీకరణలో పాల్గొనలేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్ వెండితెర నటుల్లో తొలిసారిగా షూటింగ్ సెట్లో అడుగుపెట్టింది ప్రముఖ హీరోయిన్ తాప్సీ . ఈ విషయాన్ని తానే స్వయంగా తెలిపింది.
దీనికి సంబంధించి తన మేకప్ రూమ్ ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది తాప్సీ. 'బ్యాక్ టు వర్క్' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. అయితే ఏ సినిమాకు సంబంధించిన షూటింగ్ అనేది స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం 'హసీన్ దిల్రుబా' సహా పలు చిత్రాల్లో నటిస్తోందీ భామ.