భారత స్టార్ క్రికెటర్లు ధోనీ, సచిన్ తెందుల్కర్ల బయోపిక్‌లు ఇప్పటికే వెండితెరపై సందడి చేశాయి. ఈ జాబితాలోకి మరో సినిమా వచ్చి చేరింది. అదే హీరోయిన్ తాప్సీ నటిస్తున్న 'శభాష్ మిథు'. భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తీస్తున్నారు. ఈరోజు(బుధవారం) వచ్చిన ఫస్ట్‌లుక్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందీ తాప్సీ. టీమిండియా జెర్సీలో ఉన్న ఈ భామ.. బ్యాట్‌తో షాట్ కొడుతున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోకు ఓ సందేశాన్ని జోడించింది.
"మీకు ఇష్టమైన పురుష క్రికెటర్ ఎవరూ అని నన్ను ఎప్పుడూ అడుగుతుంటారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఇష్టమైన మహిళా క్రికెటర్ ఎవరు?"
- తాప్సీ, కథానాయిక