విద్యుత్ బిల్లుల సెగ.. బాలీవుడ్‌ను తాకింది. లాక్‌డౌన్‌లో తమ బిల్లు ఊహించని రీతిలో పెరిగాయని నటులు తాప్సీ, హ్యుమా ఖురేషీ, దర్శకుడు బిజోయ్ నంబియార్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 3 నుంచి 4 వేల వరకూ వచ్చిన మొత్తం.. ఇప్పుడు ఏకంగా 30 నుంచి 50 వేల వరకూ వస్తోందని తెలిపారు.
గతంలో ఎన్నడూ చూడనంతా విద్యుత్ బిల్లులు తమకు వస్తున్నాయని ప్రముఖ నటి తాప్సీ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఏప్రిల్-జూన్ వరకూ వచ్చిన విద్యుత్ బిల్లులను ట్వీట్ చేశారు. ఏప్రిల్, మే నెలలో రూ.3 నుంచి 4 వేల వరకూ విద్యుత్ బిల్లులు రాగా.. జూన్‌లో మాత్రం ఏకంగా రూ.36 వేలు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఉపయోగించిన ఉపకరణాలు ఏమి లేనప్పటికి ఈ స్థాయిలో విద్యుత్ బిల్లులు రావటంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
తాను వినియోగించని అపార్ట్‌మెంట్‌కూ రూ.8,600 బిల్లు వచ్చినట్లు బాలీవుడ్ నటుడు ఒకరు తెలియజేశారు. దీనిని చూస్తే, తన అపార్ట్మెంట్లో ఎవరైనా ఉంటున్నారమోనని అనుమానం కలుగుతుందని అన్నారు.
నటుడు పుల్కిత్ సామ్రాట్.. తనకు రూ.30 వేల బిల్ వచ్చిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇదే విషయమై స్పందించిన నటి రేణుకా సహానే.. మే నెలలో రూ.5,500 బిల్లు రాగా... జూన్‌లో వచ్చిన మొత్తం చూసి తాను షాక్ తిన్నట్లు వెల్లడించారు.