తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'హీరో భార్యలకు నచ్చక అవకాశాలు కోల్పోయా' - చిత్రపరిశ్రమలో తాప్సీకి చేదు అనుభవాలు

హీరోయిన్​గా కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అంటోంది బాలీవుడ్​ నటి తాప్సీ. తనను కథానాయికగా తీసుకోవడానికి కొంతమంది నిర్మాతలు ఇష్టపడేవారు కాదని పేర్కొంది. ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన తాప్సీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Taapsee Pannu has revealed about the struggles she faced during her initial days in the film industry
తాప్సీ

By

Published : Nov 18, 2020, 12:32 PM IST

సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో తాను చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు బాలీవుడ్​ నటి తాప్సీ చెప్పింది. హీరోల భార్యలకు తాను నచ్చకపోవడం వల్ల సినిమాల్లో అవకాశాలు కోల్పోయినట్లు తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో వెల్లడించింది.

"హీరో భార్యలకు నేను నచ్చకపోవడం వల్ల నేను అనేక సినిమా అవకాశాలు కోల్పోయాను. ఒక్కోసారి నేను చెప్పిన డైలాగ్​ హీరోకు నచ్చకపోయినా దాన్ని మార్చేవారు. అందుకు నేను అంగీకరించకపోవడం వల్ల ఓ డబ్బింగ్​ ఆర్టిస్ట్​తో డైలాగ్​ మార్చి చెప్పించారు. హీరో ఇంట్రడక్షన్​ కంటే నా పరిచయ సన్నివేశం బాగుంటే దాన్ని మార్చమని చెప్పిన హీరోలూ ఉన్నారు. నా ముందే ఇలాంటివి జరుగుతుంటే.. నా వెనుక మరెన్ని జరుగుతున్నాయో నాకు తెలియదు."

- తాప్సీ, బాలీవుడ్​ నటి

తాను వెలుగులోకి రావడానికి ఇష్టపడని కొంతమంది హీరోలు ఉన్నారని తాప్సీ అంటోంది. ఈ విధంగా తాను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ సినీ పరిశ్రమలో తన సుదీర్ఘ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపింది. తాప్సీ ప్రస్తుతం 'హసీన్​ దిల్​రూబా', 'రష్మీ రాకెట్'​, 'లూప్​ లాపెటా' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details