పార్టీలో అందరి ముందూ భర్త తనని కొట్టాడని విడాకులకు దరఖాస్తు చేసింది నటి తాప్సీ. ఆమె నటిస్తున్న చిత్రం 'తప్పడ్'లోని ఓ సన్నివేశం ఇది. విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న తాప్సీ... మరోసారి తనదైన శైలిలో భిన్న కథాంశంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమౌతోంది.
అనుభవ్ సుశీల సిన్హా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు భూషణ్ సుదేశ్ కుమార్, కృష్ణన్ కృష్ణ కుమార్ నిర్మాతలు. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో శుక్రవారం 'తప్పడ్' ట్రైలర్‌ను సోషల్మీడియా వేదికగా పంచుకుంది చిత్రబృందం.