బాలీవుడ్ బ్యూటీ తాప్సీ నివాసానికి ఇటీవలే వచ్చిన రూ.36 వేల విద్యుత్ వినియోగ బిల్లు చర్చనీయాంశంగా మారింది. లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా బిల్లు తీయకుండా వాటన్నిటిని తాజాగా పంపారు. అన్ని శ్లాబులనూ కలిపి ఒక్క నెలలోనే ఈ మొత్తం సుంకాన్ని విధించారు. ఈ క్రమంలోనే సాధారణం కన్నా 10 రెట్లు అధికంగా బిల్లు వచ్చిందని తాప్సీ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, తాజాగా వచ్చిన మొత్తాన్ని లెక్కించగా.. బిల్లు చట్టబద్దమైనదేనని ఈ ముద్దుగుమ్మ స్పష్టం చేసింది.
"ఒక గంటపాటు సుదీర్ఘ చర్చల అనంతరం.. ఈ భారీ బిల్లును లెక్కించగా అంతా సరిపోయింది. మొదట ఈ రసీదును చూడగానే శీతాకాలం సమయంలో రావాల్సిందేమో అనుకున్నా. ఇది మా అందరినీ నిజంగా ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంత మొత్తం ఎలా వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ దీని వివరణను ఓపికగా చెప్పినందుకు అదానీ విద్యుత్ సంస్థకు ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో ముందు జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తున్నా."