బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది హీరోయిన్ తాప్సీ. ప్రస్తుతం ఆమె 'రష్మీ రాకెట్' అనే స్పోర్ట్స్ డ్రామా చిత్రం కోసం సిద్ధమవుతోంది. దీన్ని ఆకర్ష్ ఖురానా తెరకెక్కిస్తున్నాడు. గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే ఓ అథ్లెట్ పాత్రలో తాప్సీ కనిపించనుంది. ఆ పాత్రకు తగినట్లుగా తన శరీరాన్ని మలుచుకొనేందుకు గంటల తరబడి చెమటోడుస్తోంది.
'జిమ్‌లు లేక 45 అంతస్తులు ఎక్కిదిగేదాన్ని' - 45 అంతస్తులపై తాప్సీ కసరత్తులు
'రష్మీ రాకెట్' చిత్రం కోసం తానెంతో కష్టపడినట్లు వెల్లడించింది స్టార్ హీరోయిన్ తాప్సీ. లాక్‌డౌన్ సమయంలో జిమ్‌లు లేకపోవడం వల్ల ఇంటివద్దే కసరత్తులు చేస్తూ.. 45 అంతస్తుల భవనాన్ని ఎక్కిదిగిన సందర్భాలున్నాయని తెలిపింది.
'జిమ్‌లు లేక 45 అంతస్తులు ఎక్కిదిగేదాన్ని'
"రెండున్నర నెలల పాటు రష్మీ పాత్ర కోసం సన్నద్ధమయ్యాను. లాక్‌డౌన్ కారణంగా వ్యాయామశాలలు మూసివేయడం వల్ల పెద్ద దెబ్బే తగిలింది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకొనేందుకు ఇంటివద్దే విస్తృతమైన కసరత్తులు చేశాను. రోజూ మా ఇంటి ఆవరణలో 2 కి.మీ.మేర పరుగెట్టేదాన్ని. 45 అంతస్తుల మా అపార్ట్‌మెంట్ భవనాన్ని ఎక్కి దిగిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి" అని శరీరాకృతి కోసం తను పడ్డ శ్రమ గురించి చెప్పింది తాప్సీ.
ఇదీ చూడండి:నజ్రియా.. నీ నవ్వుతో చేశావ్ మాయ!