తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఐటీ దాడులపై తొలిసారి స్పందించిన తాప్సీ - తాప్సీ మూవీ న్యూస్

గతంలో తన నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తనకు గుర్తులేదని చెప్పారు తాప్సీ. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.

Taapsee Pannu breaks silence on I-T raids
ఐటీ దాడులపై తొలిసారి స్పందించిన తాప్సీ

By

Published : Mar 6, 2021, 12:21 PM IST

Updated : Mar 6, 2021, 1:59 PM IST

తన నివాసంలో ఆదాయపన్ను (ఐటీ) అధికారుల సోదాలు జరపడంపై నటి తాప్సీ మొదటిసారి పెదవి విప్పింది. ట్విటర్‌ వేదికగా స్పందించింది. గడిచిన మూడు రోజులగా తన నివాసంలో ఏం జరిగిందో చెప్పారు. పారిస్‌లో తనకు ఒక బంగ్లా ఉందంటూ దాని తాళాల కోసం వెతికారని, కానీ తనకు అక్కడ ఇల్లు లేదని తాప్సీ చెప్పారు. రూ.5 కోట్లు తీసుకున్నానని ఆరోపిస్తూ దాని రశీదులు కోసం వెతికారని, కానీ తానెప్పుడూ ఆ మొత్తాన్ని తీసుకోలేదన్నారు. ఆర్థిక మంత్రి చెప్పినట్లు 2013లో తన నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తనకు గుర్తులేదంటూ తాప్సీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీతోపాటు పలువురు నివాసాల్లో ఇటీవల ఐటీ సోదాలు జరిగాయి. ఈ తనిఖీలపై స్పందించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. 'నేను ఎవరిపై కామెంట్‌ చేయాలనుకోవడం లేదు. 2013లో కూడా వాళ్లపై ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలో పట్టించుకోని ఈ సమస్యను ఇప్పుడెందుకు ఇంత పెద్ద విషయంగా చూస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. వీటిపై తాప్సీ ఇప్పుడు స్పందించారు.

ఇది చదవండి:ఐటీ దాడులపై మంత్రి సాయం కోరిన తాప్సీ బాయ్​ఫ్రెండ్

Last Updated : Mar 6, 2021, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details