భారత స్టార్ క్రికెటర్లు ధోనీ, సచిన్ తెందుల్కర్ల బయోపిక్‌లు ఇప్పటికే వెండితెరపై సందడి చేశాయి. ఈ జాబితాలోకి మరో సినిమా వచ్చి చేరింది. అదే హీరోయిన్ తాప్సీ నటిస్తున్న 'శభాష్ మిథు'. భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తీస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం ప్రాక్టీస్ షురూ చేసింది తాప్సీ. తాను నటిస్తోన్న 'రష్మి రాకెట్' చిత్రీకరణ సోమవారం ముగించుకుని మిథాలీ బయోపిక్ కోసం కసరత్తులు మొదలుపెట్టింది.
'శభాష్ మిథు' కోసం ప్రాక్టీస్ షురూ చేసిన తాప్సీ - టశభాష్ మిథు తాప్సీ
టీమ్ఇండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితాధారంగా 'శభాష్ మిథు' అనే చిత్రం తెరకెక్కుతోంది. తాప్సీ హీరోయిన్గా చేస్తోంది. తాజాగా ఈ పాత్ర కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టింది తాప్సీ.
శభాష్ మిథు కోసం ప్రాక్టీస్ షురూ చేసిన తాప్సీ
ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ "బ్యాట్, బంతితో రొమాన్స్ మొదలైంది. చాలా దూరం ప్రయాణించాలి. కానీ సరైన ప్రారంభం లభిస్తే సగం పని అయిపోయినట్లే. మిథాలీ, చిత్రబృందం, నాకు ఇది మరో మైలురాయిలా నిలిచిపోతుంది" అంటూ క్యాప్షన్ ఇచ్చింది తాప్సీ.
'పర్జానియా', 'రాయిస్'కు దర్శకత్వం వహించిన రాహుల్ ధోలాకియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తోంది.