తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫస్ట్​లుక్: క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో తాప్సీ - బాలీవుడ్ సినిమా వార్తలు

తాప్సీ, విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'హసీన్ దిల్​రుబా'. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్​తో పాటు విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

ఫస్ట్​లుక్
Taapsee Pannu

By

Published : Dec 17, 2019, 5:59 PM IST

తాప్సీ హిందీలోనూ, దక్షిణాది చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ నటి 'హసీన్‌ దిల్‌రుబా' అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది.

ఈ పోస్టర్లో ఓ మహిళ తన చీరను పైకి సర్దుకొని రక్తపు మడుగులో నిల్చుని ఉంది. ఆ రక్తపు మడుగు పక్కనే ఓ పదునైన కత్తి ఉంది. మొత్తం మీద ఈ స్టిల్‌ ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసేలా ఉంది. చిత్ర కథ రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఉంటుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎరోస్‌ ఇంటర్నేషనల్, కలర్‌ ఎల్లో ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి వినిల్‌ మాథ్యూ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఫస్ట్​లుక్

ఈ చిత్రంలో తాప్సీకి జోడిగా బుల్లితెర నటుడు విక్రాంత్‌ మాస్సే నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 18, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తం మీద తాప్సీ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో రాణిస్తోంది. ఈ ఏడాది తాప్సి 'మిషన్‌ మంగళ్‌', 'సాండ్‌ కి ఆంఖ్‌' సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రముఖ మహిళా క్రికెటర్‌ మిథాలి రాజ్‌ జీతాధారంగా వస్తున్న 'శభాష్‌ మిథు' చిత్రంలోనూ ప్రధాన పాత్రలో కనిపించనుందీ భామ.

ఇవీ చూడండి.. ముద్దుతో 'గుడ్‌ నైట్‌' చెబుతోన్న సన్నీ లియోని

ABOUT THE AUTHOR

...view details