బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ.. తన కొత్త సినిమా విడుదల తేదీని ప్రకటించింది. వచ్చే ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) సందర్భంగా మార్చి 6న విడుదల చేయనున్నట్లు చెప్పింది. ఈ చిత్రానికి అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్నాడు.
"వచ్చే ఏడాది మహిళా దినోత్సవాన్ని మరింత ఆనందంగా జరుపుకుంటా. అదే రోజు రాబోతున్న నా చిత్రాన్ని తప్పకుండా చూడండి". -తాప్సీ పన్ను, నటి
"నా 11వ చిత్రాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాను మహిళలకు అంకితమిస్తున్నా." -అనుభవ్ సిన్హా, దర్శకుడు
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ముల్క్' ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. 'మిషన్ మంగళ్'తో ఇటీవలే హిట్ కొట్టిన తాప్సీ.. 'సాంద్ కీ ఆంఖ్'తో దీపావళికి సందడి చేయనుంది.
ఇదీ చూడండి: గణపతి ఉత్సవాల్లో సిగరెట్‌తో సల్మాన్‌ఖాన్