మణికర్ణిక సినిమాతో ప్రేక్షకులను అకట్టుకుంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. తన జీవితాన్ని త్వరలో సినిమాగా తెరకెక్కిస్తానని..దానికి తనే దర్శకత్వం వహిస్తానని చెప్పింది.
బాహుబలి, మణికర్ణిక చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రం కోసం పని చేయనున్నారు. అక్టోబరు-నవంబరు మధ్యలో సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని చెప్పారు.
"నా జీవిత కథే నా తర్వాతి సినిమా. నేనే దర్శకత్వం వహిస్తా. నా జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటల్ని ఇందులో పొందుపరుస్తా" - కంగనా
12 వారాల క్రితం కలిసి నా జీవిత కథను రాస్తానని విజయేంద్ర ప్రసాద్ చెప్పారని తెలిపింది కంగన. మొదట నేను భయపడ్డానని, తర్వాత ఆయన నమ్మకాన్ని చూసి అంగీకరించానని వెల్లడించింది.
"ఎటువంటి సినీ నేపథ్యం లేని ఒక అమ్మాయి..బాలీవుడ్ హీరోయిన్గా ఎలా రాణించింది. అన్ని అవరోధాల్ని దాటుకుంటా ఉన్నత స్థానానికి ఎలా వెళ్లింది అనేదే ఈ సినిమా కథ" అని తెలిపింది కంగన.