తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సైరా' ట్రైలర్ వచ్చేది ఆ రోజేనా...! - అమితాబ్ బచ్చన్

హీరో చిరంజీవి నటిస్తున్న 'సైరా'ను అక్టోబరు 2న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఆగస్టు 22 మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్​ను తీసుకువచ్చే అవకాశముంది.

'సైరా' ట్రైలర్ వచ్చేది ఆ రోజేనా...!

By

Published : Jun 19, 2019, 9:01 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం ‘సైరా’. అమితాబ్‌బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్‌సేతుపతి, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్‌ నిర్మాత. చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉందీ చిత్రం. చిరంజీవి పుట్టినరోజు(ఆగస్టు 22)న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో ప్రముఖ కథానాయిక అనుష్క ఓ కీలక పాత్ర పోషించారు. ఇటీవలే ఆమెకు సంబంధించిన సన్నివేశాల్ని కూడా తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాలు, పోరాట ఘట్టాలకు అధిక ప్రాధాన్యం ఉన్న చిత్రమిది.

సైరా సినిమాలోని స్టిల్

అక్టోబరు 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇది చదవండి: నాకు స్ఫూర్తినిచ్చిన వారిలో మీరొకరు: ఆమిర్

ABOUT THE AUTHOR

...view details