మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'సైరా'. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ప్రీరిలీజ్ ఈవెంట్నుఈ బుధవారం నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ వేడుకను వాయిదా వేయాలని భావిస్తోంది చిత్రబృందం. ఆ రోజు హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కేంద్ర వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈనెల 18న భాగ్యనగరంలో భారీ వర్షాలు పడే అవకాశముంది. ఎల్బీ స్టేడియం వంటి బహిరంగ ప్రాంగణంలో వేడుకను నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఆరోజు జరగాల్సిన వేడుకను 22వ తేదీకి వాయిదా వేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. మరి ట్రైలర్ను ఎప్పుడు విడుదల చేస్తారనేది చూడాలి.