తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2020, 8:04 AM IST

ETV Bharat / sitara

'మీటూ' స్త్రీల సమస్య మాత్రమే కాదు: సన్నీ

స్త్రీలపై లైగింక వేధింపుల విషయంపై స్పందించింది బాలీవుడ్ నటి సన్నీ లియోని. వేధింపులు స్త్రీలపైనే కాక మగవారిపైనా జరుగుతున్నాయని తెలిపింది.

sunny
సన్నీ

స్త్రీలపై లైగింక వేధింపులకు సంబంధించి రెండేళ్లుగా 'మీటూ' ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. ఇప్పుడు అలాంటి చర్చలు మరిన్ని జరగాలని చెబుతోంది బాలీవుడ్‌ నటి సన్నీ లియోని. ఈ మధ్య ఓ ముఖాముఖి సమావేశంలో సన్నీ లియోని మాట్లాడుతూ పలు విషయాలను పంచుకుంది.

"మనకు జరిగిన సంఘటనను బయటకు చెప్పడం ద్వారా, మనకే కాదు ఇతురులకూ మంచి చేసిన వాళ్లం అవుతాం. నా పద్దెనిమిదేళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యాను. వెంటనే నా నిర్మాత దగ్గరకు వెళ్లి అక్కడ నేను ఎదుర్కొన్న ఇబ్బందిని తెలియజేశాను. తరువాత కొంత సర్దుబాటు అయ్యింది. ముందుగా మనం పనిచేసే చోట కొన్ని అనుకోని పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చు. మనమూ కొంచెం గట్టిగానే ఉండాలి. ఇదీ స్త్రీల సమస్యే కాదు. మగవాళ్లు కూడా కొన్నిచోట్ల లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇలాంటి వాటిపై విస్తృతమైన చర్చ జరిగితే అలాంటి పనులకు పాల్పడాలనుకునేవాళ్లు, ఏదో ఒకరోజు వాళ్ల వికృత చేష్టలు బయటకు వస్తాయని భయపడతారు. ఎందుకంటే ఇప్పుడు బయటకు వస్తున్న సంఘటనలన్నీ ఈరోజు జరిగినవి కాదు."
-సన్నీ లియోని, సినీ నటి

ప్రస్తుతం సన్నీ తమిళ్‌లో 'వీరమాదేవి'లో నటిస్తోంది. హిందీలో 'మోటిచూర్‌ చక్నాచోర్‌' అనే చిత్రంలో ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఇక వెబ్‌సీరీస్‌లో తెరకెక్కిన 'రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్‌ రిటర్న్‌ సీజన్‌2'లోను చేసింది.

ఇవీ చూడండి.. ఆ సినిమా 17 ఏళ్ల ప్రేమకు తీపిగుర్తు: జెనీలియా

ABOUT THE AUTHOR

...view details