తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగాస్టార్ 'సైరా' .. వసూళ్లతో ఔరా..! - chiru movie collections

విడుదలైన 12 రోజుల్లోనే రూ. 230 కోట్ల వసూళ్లు సాధించిన 'సైరా నరసింహారెడ్డి'.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అమెరికాలో ఇప్పటివరకు 2.5 మిలియన్ డాలర్లు కలెక్షన్లు సాధించింది.

సైరా నరసింహారెడ్డి

By

Published : Oct 14, 2019, 3:27 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి' వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిరు సినిమాగా రికార్డు సృష్టించింది. అక్కడ 2.5 మిలియన్ డాలర్లు(రూ. 17కోట్లకు పైగా) కలెక్షన్లు సాధించినట్లు సినీవిశ్లేషకుల అంచనా. విడుదలైన 12 రోజుల్లో మొత్తం రూ. 230 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

మెగాస్టార్ సైరా .. వసూళ్లతో ఔరా..!

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా 'సైరా' తెరకెక్కింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. నయనతార, తమన్నా కథానాయికలు. అమితాబ్ బచ్చన్​, విజయ్​ సేతుపతి, సుదీప్​, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్​చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈనెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్​ టాక్ తెచ్చుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలూ అందుకుంది.

ఇదీ చదవండి: బాలీవుడ్​ 'జెర్సీ'​లో షాహిద్ కపూర్

ABOUT THE AUTHOR

...view details