ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వం. నయనతార కథానాయిక. తమన్నాతో పాటు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు.
ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ముందస్తు విడుదల తేదీని ఖరారు చేసింది చిత్ర బృందం. ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అదే వేడుకలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు.