తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యూఎస్​లో చిరు జోరు.. వన్​ మిలియన్​ క్లబ్​లో 'సైరా' - మెగాస్టార్ చిరంజీవి

యూఎస్​లో మిలియన్​ డాలర్​ క్లబ్​లో చేరింది 'సైరా' నరసింహారెడ్డి. స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలో చిరంజీవి.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు.

యూఎస్​లో చిరు జోరు ..వన్​ మిలియన్​ క్లబ్​లో 'సైరా'

By

Published : Oct 3, 2019, 9:26 AM IST

Updated : Oct 4, 2019, 8:45 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా' నరసింహారెడ్డి.. ప్రపంచ వ్యాప్తంగా బుధవారం విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించి, అదే రేంజ్​లో కలెక్షన్లు రాబడుతోంది. యూఎస్​లో తక్కువ సమయంలో మిలియన్​ డాలర్​ క్లబ్​లో చేరిన సినిమాగా నిలిచింది. ప్రీమియర్స్​, తొలిరోజు కలిపి 1,45,000 డాలర్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. రాబోయే వారాంతంలో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది.

సైరా సినిమాలో మెగాస్టార్ చిరంజీవి

ఈ సినిమా కోసం తొలిసారిగా స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలో కనిపించాడు చిరు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. అమిత్ త్రివేది సంగీతమందించాడు. సురేందర్​రెడ్డి దర్శకత్వం వహించాడు. రామ్​చరణ్ నిర్మాతగా వ్యవహరించాడు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 4, 2019, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details