బాలీవుడ్ నటి అనన్య పాండే.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. బొద్దింకను నోటికి దగ్గర పట్టుకుని ఫొటో దిగడమే ఇందుకు కారణం. అయితే ఈ విషయం తాను వివరణ ఇస్తానని పేర్కొంది.
బొద్దింకతో బాలీవుడ్ భామ ఫోజులు - అనన్య పాండే లైగర్
ముద్దుగుమ్మ అనన్య బొద్దింకను పట్టుకుని ఫొటోలు దిగింది. ఇందులో ఆమె దానిని నోటి దగ్గరగా పెట్టి, నవ్వుతూ కనిపిస్తుండటం వల్ల అవి కాస్త వైరల్గా మారాయి.
అనన్య పాండే
అనన్య నటించిన 'కాలీ పీలీ' టీవీ ప్రీమియర్ సందర్భంగా ఈ పోస్ట్ పెట్టింది. అయితే తమ సినిమాలో జంతువుల్ని హింసించలేదని రాసుకొచ్చింది.
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో అరంగేట్రం చేసిన అనన్య పాండే.. 'కాలీ పీలీ'తో ప్రేక్షకుల్ని గతేడాది పలకరించింది. ప్రస్తుతం శకున్ బత్రా దర్శకత్వంలో దీపికా పదుకొణెతో కలిసి నటిస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండ 'లైగర్'లో హీరోయిన్గా చేస్తోంది.