అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'బంగారు బుల్లోడు'. పూజా జవేరి హీరోయిన్‌గా నటిస్తోంది. బాలకృష్ణ నటించిన 'బంగారుబుల్లోడు' చిత్రంలోని 'స్వాతిలో ముత్యమంత..' సాంగ్‌ను ఈ చిత్రంలో రీమిక్స్ చేశారు. దానికి సంబంధించిన వీడియో ప్రోమోను విడుదల చేశారు.
బాలకృష్ణ హిట్ సాంగ్‌కు అల్లరి నరేష్ స్టెప్పులు - స్వాతిలో ముత్యమంత రీమిక్స్
అల్లరి నరేష్, పూజా జవేరి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'బంగారు బుల్లోడు'. జనవరి 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రంలోని 'స్వాతిలో ముత్యమంత..' రీమిక్స్ సాంగ్ ప్రొమోను చిత్రబృందం విడుదల చేసింది.
బాలకృష్ణ హిట్ సాంగ్‌కు అల్లరి నరేష్ స్టెప్పులు
ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. గిరి పల్లిక దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. జనవరి 23న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకుంటున్న ఆ సాంగ్ ప్రోమోను మీరు చూసేయండీ!
ఇదీ చూడండి:విజయ్ దేవరకొండ కొత్త చిత్రం 'లైగర్'