Swara Bhaskar Covid: బాలీవుడ్ నటి స్వర భాస్కర్ శుక్రవారం కరోనా బారినపడ్డారు. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు ట్విట్టర్ పోస్టు ద్వారా వెల్లడించారు. జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలున్నాయని చెప్పారు. "ఇప్పటికే రెండు సార్లు టీకా తీసుకున్నా. కాబట్టి త్వరగానే కోలుకుంటానని భావిస్తున్నా. ఇటీవలే నన్ను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా" అని ట్వీట్ చేశారు స్వర.
నటి స్వర భాస్కర్ సహా స్టార్ సింగర్‌కు కరోనా - స్వర భాస్కర్
Swara Bhaskar Covid: బాలీవుడ్లో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం మరో ముగ్గురు స్టార్లకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వారిలో నటి స్వర భాస్కర్, ప్రముఖ సింగర్ విశాల్ దడ్లానీ ఉన్నారు.
స్వర భాస్కర్
ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, సింగర్ విశాల్ దడ్లానీ, నటి కుభ్రా సైత్ కూడా వైరస్ బారినపడ్డారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైరస్ సోకిందని విశాల్ తెలిపారు. వీరితో పాటు ఇదివరకే పలువురు బాలీవుడ్ తారలు వైరస్ బారినపడ్డారు.
ఇదీ చూడండి:Mahesh Babu Covid: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు కరోనా