బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, అతడి మాజీ భార్య సుస్సానే ఖాన్ మళ్లీ కలిశారు. 2014లో విడాకులు తీసుకున్న వీరిద్దరూ, ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఒక్కచోటుకు చేరారు. అయితే తన భార్య, పిల్లల్ని మరోసారి కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఇన్స్టాలో రాసుకొచ్చాడు హృతిక్.
'తల్లిదండ్రులు, తమ పిల్లల బాధ్యతలను పంచుకోవడం మంచి ఆలోచన. నన్ను అర్థం చేసుకొని మద్దతిచ్చిన సుస్సానేకు కృతజ్ఞతలు. నా పిల్లలు మళ్లీ నా దగ్గరకు రావడం చాలా ఆనందంగా ఉంది'
-హృతిక్ రోషన్, బాలీవుడ్ హీరో