తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అడిసన్​ వ్యాధితో బాధపడ్డా: సుస్మిత - సుస్మితా నాన్​చాకు వీడియో

కసరత్తులు చేస్తున్న వీడియోలను తరచూ నెటిజన్లతో షేర్​ చేసుకుంటారు మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్​. తన ఆరోగ్య పరిస్థితి, తాను ఎదుర్కొన్న కష్టాలను తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. నన్​చాకు ప్రాక్టీస్​తో ప్రస్తుతం ఆరోగ్యవంతమైన మహిళగా మారానని అందులో చెప్పుకొచ్చారు.

Sushmita Sen says she was diagnosed with Addison disease in 2014 reveals how she fought it
అడిసన్​ వ్యాధితో తీవ్రంగా బాధపడ్డా: సుస్మితా సేన్​

By

Published : May 18, 2020, 6:38 PM IST

ఒకానొక సమయంలో తాను ఓ అరుదైన వ్యాధితో తీవ్రమైన పోరాటం చేశానని మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌ అన్నారు. తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోలతో తరచూ నెటిజన్లను ఆకట్టుకునే సుస్మిత తాజాగా ఒకప్పటి తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ ఓ వీడియో షేర్‌ చేశారు. నన్‌చాకు ప్రాక్టీస్‌ వల్ల తాను ఆరోగ్యవంతమైన మహిళగా మారానని తెలిపారు. మన శరీరం గురించి మనకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదని.. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే దాని మాట వినాలని ఆమె సూచించారు.

సుస్మితా సేన్​

"2014 సెప్టెంబర్‌లో నేను అడిసన్‌ వ్యాధితో ఇబ్బంది పడ్డా. దానివల్ల నాలో రోగ నిరోధకశక్తి పూర్తిగా దెబ్బతింది. వ్యాధితో పోరాటం చేయడానికి కూడా శక్తి లేదనుకునేదాన్ని. శరీరం పూర్తిగా నీరసించిపోయింది. ఆ సమయంలో నా కంటి చుట్టూ నల్లని వలయాలు వచ్చాయి. అలాంటి చీకటి రోజుల్లో నాలుగేళ్లు ఎలా పోరాటం చేశానో మాటల్లో చెప్పలేను. వ్యాధి నుంచి బయటపడడం కోసం ఉత్ప్రేరకాలు తీసుకున్నా. వాటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చాయి. అనారోగ్యంతోనే జీవించాలేమో అనిపించింది. అలాంటి సమయంలో నన్ను నేను రీబిల్డ్‌ చేసుకోవాలనుకున్నా. నా ఆలోచనలను బలోపేతం చేసుకున్నా. ఆరోగ్యవంతంగా మారడానికి సరైన మార్గాన్ని ఎంచుకున్నా. 'నన్‌చాకు' సాధన చేశా. కోలుకున్నా. ఎలాంటి ఉత్ప్రేరకాలు లేకుండా 2019 నాటికి నేను మళ్లీ మామూలు స్థితికి వచ్చేశా" అని సుస్మిత తెలిపారు.

ఇదీ చూడండి.. తారక 'భీమ్​' ఫస్ట్​లుక్​ లేదు.. కానీ!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details