ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారమైన ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ అవార్డుకు బాలీవుడ్ తారలు హేమా మాలిని, సుస్మితా సేన్ ఎంపికయ్యారు. మహిళా సాధికారత, సాంఘిక సంక్షేమానికి చేసిన కృషికి గానూ సుస్మితను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో తన అభిమానులతో పంచుకుందీ మాజీ మిస్ యూనివర్స్.
మరోవైపు హేమామాలిని ట్విట్టర్లో తన అభిమానులతో ముచ్చటిస్తూ.. ఈ ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ అవార్డు-2021 గ్రహీతల్లో తాను ఒకరినని చెప్పుకొచ్చింది. నటిగా, క్లాసికల్ డాన్సర్‌గా.. మధుర నియోజకవర్గంలో ఎంపీగా తాను చేసిన కృషికి ఈ పురస్కారం ప్రదానం చేశారని ఆమె తెలిపింది.