Sushmita Sen Breakup: బాలీవుడ్ సుందరి సుస్మితాసేన్ గత కొద్ది కాలంగా తన బాయ్‌ఫ్రెండ్ రోహ్మన్ షాల్‌తో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లోనే ఉంటున్నారు. సోషల్‌మీడియాలోనూ వీరిద్దరూ కలిసి వర్కౌట్స్ చేసిన వీడియోలను సుస్మిత పోస్ట్ చేస్తూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. అయితే ఇప్పుడు వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారట! ప్రస్తుతం ఒకే ఇంట్లో కాకుండా వేర్వేరుగా ఉంటున్నారని సమాచారం. ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే వీరిద్దరూ స్పందించే వరకు వేచి ఉండాల్సిందే.
గతంలోనూ సుస్మిత-రోహ్మన్ విడిపోనున్నారంటూ ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత వీరిద్దరూ ఆ ఊహాగానాలకు చెక్ పెట్టారు. మరి ఇప్పుడు ఏమి చేస్తారో చూడాలి.