తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మద్యం సేవించి రియాపై సుశాంత్​ సోదరి వేధింపులు! - Sushant's sister molested Rhea

నటి రియా చక్రవర్తిని సుశాంత్​ సోదరి మద్యం సేవించి వేధించిందని ఆమె తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఆ విషయంపైనే తోబుట్టువులిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగి.. దూరం ఏర్పడిందని వివరించారు.

'Sushant's sister
సుశాంత్​

By

Published : Aug 18, 2020, 6:18 PM IST

Updated : Aug 18, 2020, 6:45 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో కోణం వెలుగులోకి వస్తోంది. ఇటీవలే సుశాంత్​ సోదరి ప్రియాంక మద్యం సేవించి తనను వేధించిందని.. అందువల్లే తోబుట్టువులిద్దరి మధ్య దూరం పెరిగిందని రియా ఆరోపించింది. తాజాగా ఆ సమయంలో జరిగిన సంఘటనపై రియా చక్రవర్తి న్యాయబృందం పూర్తి వివరణ ఇచ్చింది.

రియా తరఫున న్యాయవాది సతీశ్​ మానిషిండే వివరణ ప్రకారం.. "సుశాంత్​, రియా మధ్య పరిచయం ఏర్పడ్డ కొత్తలో అతని ఇంటికి వెళ్తుండేది. అప్పుడు ప్రియాంక, ఆమె భర్త సిద్దార్థ్​.. రాజ్​పుత్​తోనే కలిసి ఉండేవారు. ఏప్రిల్​ 2019లో ఒకరోజు రాత్రి రియా, ప్రియాంక పార్టీకి వెళ్లారు. ఆ సమయంలో ప్రియాంక కొద్దిగా మద్యం సేవించి.. అక్కడున్న వారితో అనుచితంగా ప్రవర్తించింది. వెంటనే ఇంటికి వెళ్లిపోదామని రియా సుశాంత్​ను అడిగింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా సుశాంత్​, అతని సోదరి మద్యం సేవించడం ఆపలేదు. అప్పటికే షూటింగ్​తో రియా అలసిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే లేవాల్సి ఉంది. అక్కడే సుశాంత్​ గదిలో రియా నిద్రపోతుండగా.. అకస్మాత్తుగా ప్రియాంక గదిలోకి వచ్చి రియాను గట్టిగా పట్టుకుంది. ఆ సంఘటనతో రియా ఒక్కసారిగా షాక్​కు గురైంది. రియాను ఆ ఇంటి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్​ చేసింది. అనంతరం రియానే స్వయంగా అక్కడ నుంచి వెళ్లింది" అని మానిషిండే వెల్లడించారు.

"ఆ తర్వాత రోజు సుశాంత్​కు రియా జరిగిందంతా వివరించింది. ఈ క్రమంలోనే సుశాంత్​ తన సోదరితో వాగ్వాదానికి దిగాడు. అలా మొదటి నుంచే సుశాంత్​ కుటుంబంతో రియాకు మంచి సన్నిహిత్యం ఉండేది కాదు. అతని మరణం తర్వాత కూడా అంత్యక్రియల సమయంలో 20 మంది వ్యక్తుల జాబితాలో రియా పేరు చేర్చలేదు. అందువల్లే రియా ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయింది" అని సతీశ్​ వివరించారు.

Last Updated : Aug 18, 2020, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details