బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. అయితే సుశాంత్‌కు న్యాయం జరగాలని కొందరు అభిమానులు అమెరికాలో బిల్‌బోర్డులు ఏర్పాటు చేశారు. తాజాగా వీటిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది అమెరికా మీడియా సంస్థ. ఈ విషయాన్ని సుశాంత్ సోదరి శ్వేతా సింగ్‌కు మెయిల్ ద్వారా తెలియజేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్వేత.
సుశాంత్ బిల్‌బోర్డు తొలగింపు.. శ్వేత ఆగ్రహం
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించిన బిల్బోర్డును తొలగించేందుకు సిద్ధమైంది అమెరికా మీడియా సంస్థ. దీనిపై సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
"అమెరికా మీడియా సంస్థ ఆ బిల్‌బోర్డులను పెట్టడం వెనుక గల కారణాలను తెలుసుకోలేదు. కేవలం ఈ ప్రచారం ద్వారా సుశాంత్‌తో సంబంధం ఉన్న ఓ మహిళను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటోంది. బిల్‌బోర్డు ద్వారా న్యాయం మాత్రమే కోరుకుంటున్నాం." అంటూ రాసుకొచ్చింది శ్వేత.
జూన్ 14న సుశాంత్ తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సుశాంత్ సూసైడ్ చేసుకోలేదని అది హత్య అంటూ అతడి కుటుంబం ఆరోపిస్తోంది. రాజ్‌పుత్ మరణానికి కారణం తన ప్రేయసి రియా చక్రవర్తే అంటూ చెబుతోంది. ఈ విషయంపై ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది.