బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేస్తోంది. సినీ తారలు, స్నేహితులు, అభిమానులు సోషల్‌మీడియా ద్వారా సుశాంత్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. తాజాగా ఆయన స్నేహితుడు, నటుడు సిద్ధార్థ్ గుప్తా సుశాంత్‌తో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ సోషల్‌మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు.
"నా బాధను వర్ణించలేను. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. సోదరా.. అంతులేని అవకాశాలతో నక్షత్రాలు మెరిసే వేరే ప్రపంచంలో నిన్ను మళ్లీ కలుస్తా" అంటూ తన ఆవేదన పంచుకున్నారు. ఈ వీడియోల్లో సుశాంత్ తన స్నేహితులతో చాలా సంతోషంగా కనిపించారు.