బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. బంధుప్రీతి, ప్రముఖుల అమానుష చర్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నారంటూ ఇంకా కొంతమంది నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నారు. వారి సినిమాలను బాయ్‌కాట్ చేస్తామని నిరసనలు తెలుపుతున్నారు. సుశాంత్‌కు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
అయితే మరోసారి ఈ విమర్శలకు గురయ్యారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఆయన నటించిన 'రాధే' సినిమా ట్రైలర్ ఏప్రిల్ 22న విడుదలైంది. మే 13న థియేటర్లు సహా ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే సల్మాన్‌పై గుర్రుగా ఉన్న నెటిజన్లు.. ఆయనపై మళ్లీ విరుచుకుపడ్డారు. సుశాంత్‌కు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాను బాయ్‌కాట్ చేస్తామంటూ సోషల్‌మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో సల్మాన్ సరసన దిశా పటానీ నటిస్తుండగా.. జాకీ ష్రాఫ్, జరీనా వాహబ్, రణదీప్ హుడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడితో ఇంతకు ముందు 'వాంటెడ్', 'రెడీ', 'దబంగ్ 3' సినిమాల్లో నటించారు సల్మాన్.
ఇవీ చదవండి:రాధే రిలీజ్.. తగ్గేదే లే అంటున్న సల్మాన్