బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌కు తన పెంపుడు శునకం ఫడ్జ్ అంటే విపరీతమైన ప్రేమ. ఫడ్జ్‌తో సరదాగా గడిపిన వీడియోలను సుశాంత్ పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే, ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య తర్వాత ఫడ్జ్ బెంగ పెట్టుకొని.. ఫొటోని చూస్తూ కంటతడి పెట్టుకున్న చిత్రాలు కొంతకాలం నుంచి నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
అయితే సుశాంత్ మృతిని తట్టుకోలేక ఇటీవల ఫడ్జ్ కూడా మృతి చెందిందని కొన్నిరోజుల నుంచి సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల మరణించిందని నెట్టింట్లో వరుస పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీంతో నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.