జూన్ 14.. భారతీయ సినీ ప్రేక్షకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలీవుడ్ వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడమేంటి? అసలు ఇలా ఎందుకు చేశాడు? బాలీవుడ్‌లోని నెపోటిజమే దీనికి కారణమా? అంటూ తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. అలా అప్పడు మొదలైన ఈ చర్చ.. ఇప్పటికీ నడుస్తూనే ఉంది. గతంలో ఏ బాలీవుడ్ నటుడు చనిపోయినప్పుడు కూడా ఇంతలా మాట్లాడుకుని ఉండరేమో!
సరిగ్గా ఇదే సమయంలో సుశాంత్ చివరి చిత్రం 'దిల్ బెచారా' విడుదల తేదీని ప్రకటించారు. ఆ క్షణం నుంచి ఆరాధ్య నటుడు తమ మధ్య లేకపోయినా సరే సినిమాపై లెక్కలేనంత ప్రేమను కురిపించారు అభిమానులు. ట్రైలర్‌తో ఏకంగా ప్రపంచ రికార్డునే నెలకొల్పారు. సినిమాను అదేస్థాయిలో హిట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ కరోనా ప్రభావంతో దీనిని థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తుండటం వారికి కాస్త బాధ కలిగించింది. కానీ సుశాంత్‌ను ఆఖరిసారి చూడనున్నామనే ఆనందంలో ఈ విషయాన్ని అసలు పట్టించుకోవడమే లేదు. మరి డిజిటల్ మాధ్యమాల్లో 'దిల్ బెచారా' సినిమా ప్రపంచ రికార్డులు అందుకోనుందా? సరికొత్త మైలురాయిని ఏమైనా సృష్టించనుందా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.
హాలీవుడ్ చిత్రాల్ని అధిగమించిన ట్రైలర్
మూడేళ్ల క్రితమే 'దిల్ బెచారా' షూటింగ్ ప్రారంభమైనా, విడుదల ఇప్పటికి కుదిరింది. కరోనా ప్రభావంతో థియేటర్లకు బదులు ఓటీటీ(డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)లో జులై 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ యాప్ ఉన్న ప్రతిఒక్కరూ ఉచితంగా వీక్షించే సదుపాయం కల్పించారు.
అయితే ఇటీవలే విడుదలైన ట్రైలర్.. పలు రికార్డుల్ని సృష్టించింది. వచ్చిన 24 గంటల్లోనే(దాదాపు 4.2 మిలియన్) ప్రపంచంలోనే అత్యధిక లైకులు దక్కించుకున్న తొలి సినిమా ప్రచార చిత్రంగా అరుదైన ఘనత సాధించింది. ఇంతకు ముందు హాలీవుడ్లో అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్: ఎండ్‌గేమ్ పేరిట లైకుల రికార్డు ఉండేది. కానీ సుశాంత్ చివరి సినిమా వాటిన్నింటిని అధిగమించింది. ఈ కథనం రాసే సమయానికి 9.4 మిలియన్లుకు పైగా లైకులతో ఉంది 'దిల్ బెచారా' ట్రైలర్.
సినిమాపై భారీగానే అంచనాలు