బాలీవుడ్ నటుడు సుశాంత్.. చిత్రసీమలో నెపోటిజమ్ (బంధుప్రీతి) వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పలువురిపై బహిరంగంగానే విమర్శలు గుప్పించింది హీరోయిన్ కంగనా రనౌత్. నటుడికి న్యాయం జరిగేంతవరకు తాను పోరాడతానని స్పష్టం చేసింది.
తాజాగా ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడిన కంగన.. ఖాన్ త్రయం (సల్మాన్, షారుక్, అమీర్) సహా అమితాబ్ బచ్చన్‌ను ప్రశ్నించింది. మీరెందుకు ఈ అంశంపై మౌనం పాటిస్తున్నారు? సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని ఎందుకు అడగలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.