తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సారా అలీఖాన్​కు ప్రపోజ్​ చేయాలనుకున్న సుశాంత్​! - సుశాంత్​

సుశాంత్​ రాజ్​పుత్ 2019 జనవరిలో సారా అలీఖాన్​కు ప్రపోజ్​ చేయాలని భావించినట్లు అతని ఫామ్​హౌస్​ మేనేజర్​ తెలిపాడు. 2018 నుంచి సారా.. సుశాంత్​ ఫామ్​హౌస్​కు తరచూ వస్తుండేదని.. అయితే, 2019 జనవరి తర్వాత రావడం మానేసిందని వెల్లడించాడు.

Sushant
సుశాంత్​

By

Published : Sep 5, 2020, 4:45 PM IST

Updated : Sep 5, 2020, 10:02 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్ రాజ్​పుత్​ మృతి కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. గతంలో 'కేదార్​నాథ్'​ సినిమా విడుదలైన సమయంలో హీరోయిన్​ సారా అలీఖాన్​తో సుశాంత్​ డేటింగ్​ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు అతని ఫామ్​హౌస్ మేనేజర్ రయీజ్​​ ఈ విషయంపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సుశాంత్​ 2019 జనవరిలో సారాకు ప్రపోజ్​ చేయాలని అనుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే, అది వివాహానికి సంబంధించిందా లేక మరింకేదైనా అనేది తనకు తెలియదని అన్నాడు.

సెప్టెంబరు 2018 నుంచి ఈ ఏడాది జులై వరకు రాజ్​పుత్​కు చెందిన లోనావాలా ఫామ్​హౌస్​ సంరక్షకుడిగా వ్యవహరించాడు రయీజ్​. 2018 నుంచి సుశాంత్​ కోసం సారా ఫామ్​హౌస్​కు తరచూ వస్తుండేదని రయీజ్​ తెలిపాడు. అయితే, 2019 జనవరి తర్వాత ఆమె రావడం మానేసిందని పేర్కొన్నాడు.

"సుశాంత్​ సర్​తో కలిసి 2018 నుంచి సారా ఫామ్​హౌస్​కు రావడం ప్రారంభించింది. వారు అలా వచ్చినప్పుడల్లా.. మూడు, నాలుగు రోజులు ఇక్కడే ఉండేవారు. 2018 డిసెంబరులో థాయిలాండ్​ పర్యటన నుంచి తిరిగి వచ్చాక.. వారిద్దరూ విమానాశ్రయం నుంచి నేరుగా ఫామ్​హౌస్​కు వచ్చారు. వారితో మరొక స్నేహితుడు కూడా ఉన్నాడు. సారా మేడమ్​ చాలా మంచిది. అసలు ఒక నటినన్న గర్వం ఉండదు. చాలా సింపుల్​గా ఉంటుంది."

-రయీజ్​, సుశాంత్​ ఫామ్​హౌస్​ మేనేజర్​

"సుశాంత్ సర్​ లాక్​డౌన్​ మొదలవ్వడానికి ముందు మార్చిలో ఫామ్​హౌస్​కు రావాలని అనుకున్నారు. ఇక్కడే రెండు మూడు నెలలు గడపాలని.. సేంద్రీయ వ్యవసాయం చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు. ఫామ్​హౌస్​లో ఆయనకు అవసరమైన వస్తువుల జాబితాను శామ్యూల్​ మిరండా, దీపేశ్​ సావంత్​ల చేత నాకు పంపించారు. అయితే ఆ ప్రణాళికను విరమించుకున్నారు. కొంత సామాగ్రి ముంబయి నుంచి ఫామ్​హౌస్​కు వచ్చింది. సుశాంత్ సర్​ కూడా ముంబయి నుంచి మార్చిలో ఫామ్​హౌస్​కు బయలుదేరాలని అనుకున్నారు. కానీ కుదరలేదు" అని రయీజ్​ తెలిపారు.

ఫామ్​హౌస్​ సిబ్బందితో ఎప్పుడూ కలిసి మెలిసి ఉండే సుశాంత్​ వంటి యజమానిని ఇంతవరకూ చూడలేదని రయీజ్​ తెలిపాడు. తమను ఒక కుటుంబ సభ్యుల్లా భావించేవాడని.. ఆయన అకాల మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆవేదన చెందాడు.

Last Updated : Sep 5, 2020, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details