తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో సుశాంత్ సింగ్ మృతిపై వీడిన మిస్టరీ - sushant singh post mortem report

సోమవారం వచ్చిన పోస్టుమార్టమ్ నివేదికలో, హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. అయితే దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని బంధువులు కోరుతున్నారు.

హీరో సుశాంత్ సింగ్ మరణంపై వీడిన మిస్టరీ
సుశాంత్ సింగ్

By

Published : Jun 15, 2020, 11:06 AM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్ సింగ్​ రాజ్​పుత్ మరణంపై మిస్టరీ వీడింది. అతడు ఆత్మహత్య చేసుకునే మరణించాడని పోస్టుమార్టమ్​ నివేదికలో తేలింది. అంతకు ముందు పోలీసులు మాట్లాడుతూ.. సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించిన ఎటువంటి నోట్ అతడి ఇంట్లో​ దొరకలేదని చెప్పారు.

హర్యానా ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్న సుశాంత్ సింగ్ బావ ఓపీ సింగ్ మాత్రం.. ఈ మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details