తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ 5 సార్లు సుశాంత్​ 'మృతి' దేనికి సంకేతం? - sushant singh rajput age

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​... గాడ్​ ఫాదర్​ లేకుండా వెండితెరపైకి అడుగుపెట్టి అందనంత స్థాయిలో అభిమానుల ప్రేమను పొందిన నటుడు. అయితే అనూహ్యంగా ఎన్నో ఆశలు, కలలను విడిచిపెట్టి, ఎందరినో శోకసంద్రంలో ముంచి తనువు చాలించాడు. జూన్​ 14న ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఎంతో కెరీర్​ ఉన్న ఈ కథా నాయకుడు గతంలో 5 సార్లు చనిపోయాడు. అదెలా అంటే..?

sushant singh rajput latest news
5 సార్లు చనిపోయిన సుశాంత్​ సింగ్​.. ఇలా!

By

Published : Jun 19, 2020, 5:21 PM IST

Updated : Jun 19, 2020, 5:32 PM IST

జీవితంలో ఎన్నో సాధించాలని ఆశపడిన బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్​ 14న ఆత్మహత్య చేసుకుని అందర్నీ షాక్‌కు గురి చేశాడు. మానసిక ఆందోళన కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు.

చిన్నస్థాయి నుంచి వచ్చి హీరోగా ఎదిగిన సుశాంత్​.. ఎందరో అభిమానులను ఆదరణ ప్రేమ దక్కించుకోవడంలో విజయవంతమయ్యాడు. అయితే తన మజిలీని అర్థంతరంగా ముగించాడు. జీవితంలో తాను సాధించాలనుకున్న 50 కలలు.. అతడి ఆలోచనలు, ఆశయాలు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు. అతడి గతాన్ని తరచి చూస్తే.. నవ్వు, చిన్న జీవితం, కాలంతో పోటీపడి పరుగెత్తిన ఓ వ్యక్తి మనకు సదృశ్యమవుతాడు. 34 ఏళ్లలో అందరూ తాము అనుకున్న బకెట్​ లిస్టు కోరికలు పూర్తికావు. అలానే సుశాంత్​ జీవితంలోనూ జరిగింది. ఇది నిజ జీవితంలోనే కాకుండా రీల్​ తెరపైనా అతడికి అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. దాదాపు 11 సినిమాలు నటిస్తే అందులో 5 అతడికి కన్నీటి ముగింపుతో కూడిన కథలే.

ఇలా ఐదుసార్లు...

2013లో వచ్చిన 'కై పో చె' సినిమాను అభిషేక్​ కపూర్​ తెరకెక్కించారు. ఇది చేతన్​ భగత్​ రాసిన '3 మిస్టేక్స్​ ఆఫ్​ మై లైఫ్​' అనే పుస్తకం ఆధారంగా తీసిన సినిమా. ఇందులో గుజరాత్​ అల్లర్లు గురించి ప్రస్తావించగా.. సినిమాలో ఇషాన్​గా కనిపించాడు సుశాంత్. ఈ చిత్రంలోని తన​ క్యారెక్టర్​కు అనూహ్య ముగింపే ఉంటుంది.

2017లో దినేష్​ విజన్​ తెరకెక్కించిన రాబ్తా సినిమాలోనూ ఇతడు చనిపోతాడు. 2018లో విడుదలైన కేదార్​నాథ్​లో ఉత్తరాఖండ్​ వరదలు చూపించారు. ఇందులో ముస్లిం యువకుడిగా అలరించాడు. ఇందులో ఆఖర్లో హెలికాప్టర్​ నుంచి పడిపోగా... ఇతడి పాత్ర ముగిసిపోతుంది.

2019లో అభిషేక్​ చౌబే తెరకెక్కించిన సోంచిరియా సినిమాలో లఖ్నా పాత్ర పోషించాడు సుశాంత్. ఇందులోనూ దుఃఖంతో కూడిన ముగింపే.

సుశాంత్​ నటించిన 'చిచోరే' సినిమాలో మాత్రం ఆత్మహత్య చేసుకోవద్దని అద్భుతమైన సందేశం ఉంటుంది. చనిపోయేందుకు ప్రయత్నించిన తన కొడుకుకు ఫలితం గురించి చెప్పిన ఓ మాట అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. "నీ ఫలితాలు నువ్వు ఓడావా గెలిచావా అని తేల్చలేవు. నీ కష్టమే దాన్ని నిర్ణయిస్తుంది" అన పలికిన మాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎన్నో చెప్పిన అతడు ఆఖరికి అదే తరహాలో చనిపోవడం అభిమానులకు గుండెకోతను మిగిల్చింది.

2020లో ఆఖరిగా నటించిన 'దిల్​ బెచారా' చిత్రం ఇటీవలె ఓటీటీ వేదికగా విడుదలైంది. ఇందులోనూ క్యాన్సర్​తో పోరాడి ఓడిన వ్యక్తిగా కనిపించాడు సుశాంత్. ఇలా ఐదుసార్లు వెండితెరపై చనిపోయిన ఇతడు.. ఆడియన్స్​తో ఎక్కువగా మమేకం అయిపోయాడు. ఇలాంటి సినిమాలకు ఎక్కువగా ప్రజలు కనెక్ట్​ అవుతారు. గతంలో అమితాబ్​(27), షారుఖ్​(17) ఇలాంటి ముగింపు​ ఉన్న సినిమాలతోనే పేరు తెచ్చుకున్నారు.

షైమిక్​ దావర్​ గ్రూప్​లో డ్యాన్సర్​గా ప్రస్థానం మొదలుపెట్టిన సుశాంత్​.. 'వెండి తెర ధోని'గా అలరించి చివరికి తన మజిలీని ఓ మరపురాని జ్ఞాపకంగా వదిలి మధ్యలోనే వెళ్లిపోయాడు.

(రచయిత- కావేరీ బామ్​జాయ్​)

ఇవీ చూడండి:

  1. జీవితమనే ఆటలో అర్థాంతరంగా ముగిసిన ఇన్నింగ్స్​
  2. చనిపోయే మూడు రోజుల ముందే స్టాఫ్​కు సుశాంత్ జీతాలు!
  3. 'మిత్రమా.. మరో ప్రపంచంలో మళ్లీ కలుద్దాం'
  4. సుశాంత్​ ట్విట్టర్​ కవర్​పేజీకి అర్థం అదేనా?
  5. సుశాంత్, రియా పెళ్లి చేసుకోవాలనుకున్నారు!
  6. మొన్న మేనేజర్​.. ఈరోజు అతడే.. కారణమేంటి?
  7. సినీ రంగంలో ప్రతిభకు కొలమానం ఏంటి?
  8. 'సుశాంత్ లేడన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా'
Last Updated : Jun 19, 2020, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details