తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్​ కాలు విరిగి ఉంది.. మెడపై సూది గుర్తులు' - సుశాంత్​ ఆత్మహత్య కేసు

సుశాంత్​ మృతదేహాన్ని తమ మార్చురీకి తీసుకొచ్చినప్పుడు.. అతడి కాలు విరిగి ఉండటం సహా మెడపై సూది గుచ్చినట్లు మచ్చలు ఉన్నాయని ఆస్పత్రి సిబ్బందిలోని ఒకరు జాతీయ మీడియాతో చెప్పారు.

Sushant
సుశాంత్

By

Published : Aug 30, 2020, 8:27 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజం మరొకటి బయటకు వచ్చింది. నటుడి మృతదేహం తమ మార్చురీకి తీసుకొచ్చినప్పుడు అతడి కాలు ఒకటి విరిగిపోయి ఉండటం గమనించినట్లు కూపర్​ ఆస్పత్రి సిబ్బంది ఒకరు చెప్పారు. ఈ విషయాన్ని ఆమె జాతీయ మీడియాకు చెందిన ఓ ఛానల్​కు తెలిపారు.

​"సుశాంత్​ మృతదేహం పూర్తిగా పసుపు రంగులోకి మారిపోయింది. ఓ కాలు విరిగిపోయి ఉంది. మెడపై సూదులతో గుచ్చినట్లు మచ్చలు ఉన్నాయి. అతడి మృతదేహాన్ని పరీక్షించిన వైద్యులు, ఇదే విషయమై మాట్లాడుకున్నారు. కానీ వారు ఈ అంశాన్ని అంతగా పట్టించుకోలేదు"

-కూపర్​ ఆస్పత్రి సిబ్బంది

"ఈ వార్త వినగానే నా గుండె ఆగిపోయినంత పనైంది. నా సోదరుడిని చంపిన వారిని దయచేసి అరెస్టు చేయండి" అని ఈ వార్త విన్న వెంటనే సుశాంత్​ సోదరి శ్వేత సింగ్ చెప్పింది​.

సుశాంత్​ ఆత్మహత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ విషయమై ఆరోపణలు ఎదుర్కోంటోన్న నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు శోవిక్​, సుశాంత్ స్నేహితుడు శామ్యుల్​ మిరండా సహా పులువురిని ప్రశ్నించి, స్టేట్​మెంట్స్​ రికార్టు​ చేస్తున్నారు అధికారులు.

ఇది చూడండి 'సడక్ 2'పై కోపం సరే.. మరి మిగతా సినిమాల పరిస్థితి?

ABOUT THE AUTHOR

...view details