తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్​ డ్రగ్స్​ తీసుకోవడం నేనెప్పుడు చూడలేదు' - రియా చక్రవర్తి

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ డ్రగ్స్​ తీసుకోవడం తానేప్పుడు చూడలేదని అంటున్నారు అతడి పాత డ్రైవర్​ ధీరేంద్ర యాదవ్​. తాను పనిచేసిన ఆరు నెలల్లో అతడు మాదక ద్రవ్యాలను సేవించడం చూడలేదని, సుశాంత్ దగ్గరికి స్నేహితులు ఎవరూ రాలేదని తెలిపారు.

Sushant Singh Rajput's former driver reveals the actor didn't consume drugs
'సుశాంత్​ డ్రగ్స్​ తీసుకోవడం నేనెప్పుడు చూడలేదు'

By

Published : Sep 14, 2020, 12:15 PM IST

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ డ్రగ్స్‌ తీసుకోవడం తాను ఎప్పుడూ చూడలేదని సదరు హీరో పాత డ్రైవర్‌ ధీరేంద్ర యాదవ్‌ చెప్పారు. సుశాంత్‌ అనుమానస్పద మృతి కేసును పోలీసులు డ్రగ్స్‌ కోణంలో విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో అతడి దగ్గర పనిచేసిన కారు డ్రైవర్‌ ధీరేంద్ర‌ను ఇటీవల సీబీఐ విచారించింది. డ్రగ్స్‌, రియా చక్రవర్తి గురించి అడిగి తెలుసుకుంది. ఓ ఆంగ్ల పత్రికతో ధీరేంద్ర మాట్లాడుతూ.. సుశాంత్‌ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు.

"2018 అక్టోబర్‌ నుంచి 2019 ఏప్రిల్‌ వరకూ సుశాంత్‌ కారు డ్రైవర్‌గా పనిచేశాను. సుశాంత్‌ దగ్గర పనిలో చేరిన కొత్తలో ఆయన కథానాయకుడిగా నటించిన 'కేదార్‌నాథ్‌' చిత్రం విడుదలైంది. 'డ్రైవ్‌', 'చిచ్చోరే‌' షూటింగ్స్‌ జరుగుతున్నప్పుడు కూడా నేను ఆయన దగ్గరే పనిలో ఉన్నాను. షూటింగ్స్‌కు అనుగుణంగా ఏ సమయానికి ఎక్కడికి వెళ్లాలి అనే విషయాన్ని ఒకరోజు ముందు సుశాంత్‌ మేనేజర్‌ చెప్పేవారు. ప్రతిరోజూ జిమ్‌, స్విమ్మింగ్‌ కోసం వాటర్‌స్టోన్‌ రిసార్ట్‌, అలాగే సినిమా ప్రమోషన్స్‌కు తీసుకువెళ్లేవాడిని. కారులో ఉన్నంతసేపూ ఆయన మ్యూజిక్‌ వినడానికి ఎక్కువ ఆసక్తి చూపించేవారు. అప్పుడప్పుడు నా యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు. నేను డ్రైవర్‌గా పనిచేసిన ఆరు నెలల్లో ఆయన కారులో డ్రగ్స్‌ తీసుకోవడం ఎప్పుడూ చూడలేదు. అప్పుడప్పుడు భోజనం చేయడం కోసం సుశాంత్‌ ఇంటిలోపలికి వెళ్లేవాడిని అలా వెళ్లినప్పుడు కూడా ఆయన డ్రగ్స్‌ తీసుకోవడం గమనించలేదు. అలాగే ఆయన మానసిక కుంగుబాటులో ఉన్నట్లు ఏ రోజు కనిపించలేదు. నిజం చెబుతున్నా.. ఆయన డ్రగ్స్‌ తీసుకోవడం నేను ఎన్నడూ చూడలేదు."

- సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​, బాలీవుడ్​ నటుడు

"సుశాంత్‌కు ప్రాణస్నేహితులంటూ ఎవరూ లేరు. ఆయన ఇంటికి స్నేహితులు ఎవరూ రావు. నేను పనిచేసినప్పుడు కుశాల్‌ జవేరీ అక్కడ మేనేజర్‌, సిద్దార్థ్‌ గుప్తా సుశాంత్‌తో కలిసి అదే ఇంట్లో ఉండేవారు. అప్పట్లో సుశాంత్‌ అక్క ప్రియాంక, ఆమె భర్త సిద్దార్థ్‌ కొన్నిరోజులు ఇక్కడ ఉండివెళ్లారు" అని ధీరేంద్ర వివరించారు.

ABOUT THE AUTHOR

...view details