బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ డ్రీమ్ ప్రాజెక్ట్.. అంతరిక్ష నేపథ్యంలో తెరకెక్కాల్సిన సినిమా 'చందమామ దూర్ కి' త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సుశాంత్ స్నేహితుడు, దర్శకుడు సంజయ్ పూరన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించి సుశాంత్‌కు అంకితమిస్తానని చెప్పారు.
సుశాంత్ సింగ్ హీరోగా 'చందమామ దూర్ కి' సినిమాను తీస్తున్నట్లు 2017లో ప్రకటించారు. అందుకోసం సదరు నటుడు నాసాలో శిక్షణ కూడా తీసుకున్నారు. పాత్రలో ఒదిగిపోవడం కోసం వ్యోమగాములతో కలిసి చర్చించేవాడు. కానీ ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల తొలి దశలోనే ఆ చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు ఆ చిత్రాన్నే సంజయ్ సింగ్ రూపొందిస్తానని వెల్లడించారు.