బాలీవుడ్ నటి సంజనా సంఘి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగపు పోస్టును తాజాగా షేర్ చేసింది. హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతిపై పోలీసుల విచారణ కోసం దిల్లీ నుంచి ముంబయికి వచ్చిన ఈ నటి.. తిరుగు ప్రయాణంలో నగరానికి వీడ్కోలు చెబుతున్న విధంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. ముంబయికి ఇక తిరిగి రాకపోవచ్చనే ఆలోచన తనలో ఉన్నట్లు అందులో వ్యక్తమవుతోంది.
"గుడ్‌బై ముంబయి.. నాలుగు నెలల తర్వాత నిన్ను చూస్తున్నా. ఇప్పుడు నేను తిరిగి దిల్లీ వెళ్లిపోతున్నా. నీ వీధులన్నీ భిన్నంగా, నిర్జీవంగా కనిపిస్తున్నాయి. బహుశా నా గుండెలోని బాధ వల్లే నా చూపు అలా మారిందేమో! లేదంటే నువ్వు కూడా భారంగా ఉన్నావో మరి. త్వరలో కలుద్దాం. లేదా కలవకపోవచ్చు".