బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి 20రోజులు దాటిపోయింది. అయితే, నటి భూమిక అతని జ్ఞాపకాలకు దూరంగా వెళ్లలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ పోస్టు చేస్తూ.. సుశాంత్‌కు వీడ్కోలు ఎలా పలకాలో తెలియడం లేదంటూ చెప్పింది. ఇప్పటికీ నటుడి ఆకస్మిక మరణం వెనక ఉన్న కారణాల గురించి ఆలోచిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు హిందీ పరిశ్రమలో మనుగడ సాగించడం ఎంత కష్టమో తెలిపింది. బాలీవుడ్, దక్షిణాది సినిమాల్లో నటించిన ఈ నటి.. తన ఎమోషనల్ పోస్ట్‌లో సుశాంత్ మృతికి మానసిక ఒత్తిడి కారణమైతే ఎవరితోనైనా బాధను పంచుకోవాలని అప్పుడే సమస్య పరిష్కారమవుతుందని తెలిపింది.
ఇప్పటివరకు 50కిపైగా సినిమాలు చేసినప్పటికీ.. తాను ఒక పాత్ర కోసం చిత్రనిర్మాతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంటానని వివరించింది.అయితే, తనకు ఇంకా సినిమాల్లో అవకాశాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఇలా సుశాంత్‌కు వేదనతో తుది వీడ్కోలు పలికింది భూమిక.