బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ బంధువుపై దాడి జరిగింది. గుర్తుతెలియని ముగ్గురు దుండగులు అతడితో సహా తనతో ఉన్న మరో వ్యక్తిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం వీరిద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సుశాంత్ బంధువు(తమ్ముడు వరుస) రాజ్‌కుమార్ సింగ్‌కు బిహార్‌లోని సహార్స, మధెపురా, సౌపాల్ జిల్లాల్లో మూడు యమహా బైక్ షోరూమ్స్ ఉన్నాయి. ప్రతిరోజు ఈ మూడు షోరూమ్స్‌కు వెళ్తాడు. అలాగే శనివారం(నేడు) కూడా ఉదయం 11.30 సమయంలో అలీ హాసన్‌తో కలిసి సహర్స జిల్లాలోని షోరూమ్‌కు వెళ్తుండగా మధ్య దారిలో ముగ్గురు దుండగులు వీరిపై కాల్పులు జరిపి పారిపోయారు.