తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్​ సింగ్​తో ఆ రోజు డ్యాన్స్ ఎంతో ప్రత్యేకం' - సుశాంత్​ వార్తలు

సుశాంత్ సింగ్​తో గతంలో డ్యాన్స్​ చేసిన వీడియోను పంచుకున్నాడు నటుడు సిద్ధాంత్ చతుర్వేది. అతడి జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నానని తెలిపాడు.

sushant
సుశాంత్​

By

Published : Aug 14, 2020, 9:13 AM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్​​ చనిపోయి ఇప్పటికి రెండు నెలలు కావస్తున్నా సన్నిహితులు, అభిమానులు అతని జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇలానే యువనటుడు సిద్ధాంత్​ చతుర్వేది.. సుశాంత్​ సింగ్​తో మధురమైన స్మృతులను గుర్తు చేసుకున్నాడు.

సిద్ధాంత్​ కాలేజీలో చదువుతున్నప్పుడు నేషనల్​ టాలెంట్​ హంట్-2012​లో గెలుపొందాడు. అక్కడ నుంచే అతడి సినీ కెరీర్​ ప్రారంభమైంది. ఆ కార్యక్రమానికి నటి జాక్వెలిన్​తో పాటు సుశాంత్​ అతిథులుగా హాజరయ్యారు. తను సాధించిన విజయాన్ని ఆ రోజు సుశాంత్​తో జరుపుకోవడం ఎంతో ప్రత్యేకమని సిద్ధాంత్​ చెప్పాడు. అతడి​తో కలిసి డాన్స్​ చేసిన వీడియోను ఇన్​స్టా​లో పోస్ట్​ చేశాడు. భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలను దానికి జోడించాడు.

"నేను విజేతను.. కానీ ఇద్దరం కలిసి డాన్స్​ చేశాం. ఆ రోజు మొత్తం నేను, నా కుటుంబం అసలు నిద్రపోలేదు. స్టేజ్​పై నుంచి సుశాంత్​ సింగ్ నా పేరును స్వయంగా పిలిచాడు. ఆ రోజే నా తల్లిదండ్రులు నాలో ప్రతిభ దాగుందని గుర్తించారు. సీఏ కోర్సు పూర్తి చేస్తూనే, సినిమాల్లో నటించేందుకు అనుమతినిచ్చారు. నా ప్రయాణం ఇక్కడే ప్రారంభమయ్యింది. నువ్వు ఎప్పటికీ అందులో భాగం అవుతావు"

-సిద్ధాంత్​ చతుర్వేది, బాలీవుడ్​ నటుడు

'గల్లీబాయ్​' సినిమాలో ఎమ్​సీ షేర్​గా మెప్పించిన సిద్ధాంత్.. ప్రస్తుతం 'ఫోన్​బూత్'​, 'బంటీ ఔర్​ బబ్లీ 2' చిత్రాల్లో నటిస్తున్నాడు. పలు వెబ్​సిరీస్​ల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details