సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య గురించి ప్రస్తుతం సీబీఐ విచారణ నడుస్తోంది. అతడు సూసైడ్ చేసుకోలేదని, హత్యకు గురయ్యాడని సుశాంత్ కుటుంబం బలంగా నమ్ముతోంది. ఇదే విషయమై సుశాంత్ తరఫున లాయర్ వికాస్ సింగ్ స్పందించారు.
'సుశాంత్‌ది హత్యేనని బలమైన నమ్మకం'
సుశాంత్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదు హత్యంటూ అతడి కుటుంబం బలంగా నమ్ముతోందని వారి తరఫున లాయర్ వికాస్ సింగ్ స్పష్టం చేశారు. తాజాగా దీనిపై మాట్లాడారు.
కేసుకు సంబంధించి ముంబయి పోలీసులు సుశాంత్ తండ్రి కేకే సింగ్ దగ్గర సంతకం తీసుకోవాలని ప్రయత్నించారు. అయితే ఆ స్టేట్మెంట్ మరాఠీలో ఉండటం వల్ల వారు అందుకు నిరాకరించారు. తమ ఫ్యామిలీలో ఎవరూ మరాఠీ చదువుకున్న వారు లేరంటూ తెలిపారు. ఇదే విషయమై స్పందిస్తూ మాట్లాడారు సుశాంత్ తరఫు లాయర్ వికాస్ సింగ్.
"ఆ సమయంలో స్టేట్మెంట్ మరాఠీలో ఉన్నందుకు మాత్రమే వ్యతిరేకించాం. అందులో సుశాంత్ డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకున్నాడని ఉందేమోనని వారు సంతకం పెట్టడానికి నిరాకరించారు" అని వికాస్ తెలిపారు.