తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చనిపోయే ముందు సుశాంత్ గూగుల్​లో​ ఏం వెతికాడంటే..? - sushant singh rajput updates

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ కేసు విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. చనిపోయే ముందు ఈ యువ హీరో నొప్పి తెలియకుండా చనిపోవడమెలా? బై పోలార్​ డిజార్టర్​ అంటే? వంటి విషయాల గురించి గూగుల్​లో సెర్చ్​ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు.

Sushant Singh Rajput searched for 'painless death' on internet, says Mumbai CP
చనిపోయే ముందు సుశాంత్ గూగుల్​లో​ ఏం వెతికాడంటే..?

By

Published : Aug 3, 2020, 6:40 PM IST

బలన్మరణానికి పాల్పడిన హిందీ నటుడు సుశాంత్​ సింగ్​ కేసు విచారణలో.. ముంబయి పోలీసులు పలు విషయాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా చనిపోయే ముందు ఈ యువహీరో గూగుల్​లో వెతికిన విషయాలను కనుగొన్నారు. నొప్పి తెలియని చావు, స్కిట్జోఫ్రీనియా, బైపోలార్​ డిజార్డర్​ గురించి సెర్చ్​ చేసినట్లు సోమవారం మీడియాకు వెల్లడించారు ముంబయి పోలీస్​ కమిషనర్​ పరమ్​వీర్​ సింగ్​.

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్

ఇప్పటికే సుశాంత్​ బ్యాంక్​ ఖాతాలను పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. జనవరి 2019 నుంచి జూన్​ 2020 వరకు డేటాను చూసిన పోలీసులు.. మొత్తం 14.5 కోట్లు అకౌంట్​లో ​జమ అయినట్లు తెలిపారు. వాటిలో 4 కోట్లు ఫిక్స్​డ్​ డిపాజిట్​ రూపంలో ఉన్నట్లు స్పష్టం చేశారు.

మరోవైపు విచారణ సాగిస్తున్న బిహార్​ పోలీసులకు తాము వీలైనంతగా సహాకారం అందిస్తామని పరమ్​వీర్ వెల్లడించారు. తాము చట్టపరంగానే అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలిపారు.

జూన్​ 14న.. సుశాంత్​ ముంబయి బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details