తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆమెతో విడిపోయినందుకు సుశాంత్ చాలా బాధపడ్డాడు' - Sushant Singh news

నటి అంకితా లోఖండేతో విడిపోయినందుకు సుశాంత్ సింగ్ చాలా పశ్చాత్తాపడేవాడని అతడి సైకియాట్రిస్ట్ వెల్లడించారు. ఈ నటుడి మృతిపట్ల పోలీసులు, ప్రస్తుతం వివిధ కోణాల్లో సమగ్ర విచారణ చేపడుతున్నారు.

సుశాంత్ ఆత్మహత్య
సుశాంత్ సింగ్ అంకితా లోఖండే

By

Published : Jun 20, 2020, 1:58 PM IST

Updated : Jun 20, 2020, 3:54 PM IST

బాలీవుడ్​ సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య తర్వాత పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడితో సంబంధమున్న వ్యక్తుల్ని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆశ్చర్యపరిచే విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా అలాంటిదే సుశాంత్ సైకియాట్రిస్ట్ కేసరి చవుడా చెప్పారు. ప్రేయసి అంకితా లోఖండేతో బ్రేకప్​ అయినందుకు సుశాంత్ చాలా పశ్చాత్తాపడేవాడని వెల్లడించారు. ప్రస్తుత గర్ల్​ఫ్రెండ్ రియా చక్రవర్తి ప్రవర్తన మాత్రం అతడికి నచ్చేది కాదని తెలిపారు.

అంకితా లోఖండేతో సుశాంత్ సింగ్(పాత చిత్రం)

సుశాంత్.. కెరీర్​ ప్రారంభంలో 'పవిత్రరిస్తా' సీరియల్ చేసినప్పుడు అంకితాతో ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్లపాటు రిలేషన్​లో ఉన్న వీరిద్దరూ.. 2016లో విడిపోయారు. ఆ తర్వాత కృతి సనన్​తో డేటింగ్​లో ఉన్నాసరే ఈ నటుడు బహిరంగంగా వెల్లడించలేదు. ఇప్పటివరకు రియా చక్రవర్తితో రిలేషన్​షిప్​ కొనసాగించాడు.

ఈ ఆదివారం(జూన్ 14).. బాంద్రాలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్ సింగ్. మానసిక ఒత్తిడి కారణంగానే ఇలాంటి చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అతడి మృతికి బాలీవుడ్​లోని నెపోటిజమ్ మరో​ కారణమని పలువురు సెలబ్రిటీలు అంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. అందరిని విచారిస్తున్నారు. సుశాంత్ వంటమనిషి, మేనేజర్లు, రియా చక్రవర్తి, దర్శకుడు ముఖేశ్ చబ్రా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 20, 2020, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details